Two Headed Snake: అరుదైన రెండు తలల పాము.. ధర 25 కోట్ల పైమాటే.. జంతుప్రేమికుడి చలువతో సంరక్షణ కేంద్రానికి.. వీడియో వైరల్..
అయితే, బహిరంగ మార్కెట్లో ఈ పాము విలువ రూ. 25 కోట్లు ఉంటుందని, చైనా వంటి దేశాల్లో ఈ పాము మాంసాన్ని ఔషదాలు, హోటల్ డిష్ లలో వాడుతారని తెలుసుకున్న కొందరు.. తక్కువ ధరకు ఈ సర్పాన్ని కొందామని గ్రామస్థులతో బేరమాడారు. తర్వాత??
Patna, October 14: రెండు తలల (Two Headed) అరుదైన పాము (Rare Snake) ఒకటి బీహార్ లోని (Bihar) బెగుసరాయ్ జిల్లాలో ఉన్న ఓ గ్రామస్థులకు ఇటీవల దొరికింది. అయితే, బహిరంగ మార్కెట్లో (Market) ఈ పాము విలువ రూ. 25 కోట్లు ఉంటుందని, చైనా వంటి దేశాల్లో ఈ పాము మాంసాన్ని ఔషదాలు, హోటల్ డిష్ లలో వాడుతారని తెలుసుకున్న కొందరు.. తక్కువ ధరకు ఈ సర్పాన్ని కొందామని గ్రామస్థులతో బేరమాడారు. ఈ విషయం తెలుసుకున్న ముకేష్ పాశ్వాన్ అనే జంతు ప్రేమికుడు ఆ అరుదైన, అంతరించే దశలో ఉన్న ఈ సర్పాన్ని ఎలాగైనా రక్షించాలనుకున్నాడు.
వెంటనే ఈ విషయాన్ని జిల్లాలోని ఓ కోర్టు దృష్టికి తీసుకెళ్ళారు. పామును వెంటనే కోర్టులో ప్రవేశపెట్టాలని అధికారులను కోర్టు ఆదేశించింది. అధికారులు అలాగే చేశారు. అనంతరం పామును సంరక్షణ కేంద్రానికి తరలించాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. కోర్టుకు ఓ కంటైనర్ లో పామును తీసుకొచ్చిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.