Viral Video: ఒట్టి చేతులతో టాయిలెట్ రుద్ది మరీ క్లీన్ చేసిన బీజేపీ ఎంపీ, సోషల్ మీడియాలో వీడియో వైరల్, విమర్శలు ఎక్కుపెట్టిన నెటిజన్లు
ఆ పార్టీ నిర్వహిస్తున్న ‘సేవా పఖ్‌వాడ’ కార్యక్రమంలో భాగంగా ఖత్‌ఖారీలోని ప్రభుత్వ బాలికల పాఠశాలను ఆయన సందర్శించారు.
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌కు చెందిన ఎంపీ జనార్దన్ మిశ్రా ఒట్టి చేతులతో స్కూల్ టాయిలెట్ శుభ్రం చేశారు. ఆ పార్టీ నిర్వహిస్తున్న ‘సేవా పఖ్‌వాడ’ కార్యక్రమంలో భాగంగా ఖత్‌ఖారీలోని ప్రభుత్వ బాలికల పాఠశాలను ఆయన సందర్శించారు. అక్కడ మొక్కలు నాటిన అనంతరం అపరిశుభ్రంగా ఉన్న స్కూల్ మరుగుదొడ్డిని ఒట్టి చేతులతో క్లీన్ చేశారు. అంతేగాక ఈ వీడియోను ఆయన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ప్రధాని మోదీ, జేపీ నడ్డా, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తదితర పార్టీ నేతలకు దీనిని ట్యాగ్ చేశారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే ఒట్టి చేతులతో స్కూల్ టాయిలెట్‌ను క్లీన్ చేసిన బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా ఓవరాక్షన్‌పై విమర్శలు వెల్లువెత్తాయి. కాగా గుణ జిల్లా చక్‌దేవ్‌పూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మరుగుదొడ్లను 5-6 తరగతులు చదువుతున్న బాలికలతో గత మంగళవారం శుభ్రం చేయించారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి.