Viral Video: పులిపై మూకుమ్మడిగా దాడి చేసి చంపేసిన గేదెలు.. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన.. వీడియో ఇదిగో!

మీరు చదివింది నిజమే.. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Credits: Twitter

Newdelhi, July 22: పులిపై (Tiger) ఓ గేదెల గుంపు మూకుమ్మడిగా (Buffalo Herd) దాడి చేసి చంపేశాయి. మీరు చదివింది నిజమే.. ఇందుకు సంబంధించిన వీడియో (Video) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా మూల్ తాలూకాలో ఈ ఘటన వెలుగు చూసింది. కొంతకాలంగా ఆ ప్రాంతంలో పులి సంచారంతో స్థానికుల కంటిమీద కునుకు లేకుండా పోయింది. గురువారం ఉదయం ఎస్‌ గ్రావ్ గ్రామ పరిసరాల్లో ఓ పశువుల కాపరిపై పులి దాడికి యత్నించింది. చేతిలో ఉన్న గొడ్డలితో అతడు ఎదురు తిరగడంతో త్రుటిలో అతడు చావు నుంచి తప్పించుకోగలిగాడు. ఆ తరువాత పులి బెంబడా గ్రామంలోని అటవీ పరిసరాల్లో మేత మేస్తున్న ఆవులు, గేదెలపై దాడికి యత్నించింది.

No Rice Stock in USA: అమెరికా సూపర్ మార్కెట్ల ముందు భారీ క్యూలు.. ఎన్నారైల్లో భయాందోళనలు.. బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై భారత్ నిషేధమే కారణం.. వీడియోలు వైరల్

ఊహించని పరిణామం..

ఊహించని విధంగా గేదెలు పులిపై మూకుమ్మడిగా దాడి చేశాయి. కొమ్ములతో పొడిచేశాయి. తీవ్రంగా గాయపడ్డ పులిని అటవీ శాఖ అధికారులు చంద్రపూర్‌కు తరలించగా అది చికిత్స పొందుతూ మృతి చెందింది.

Gym Trainer Dies: మెడపై 210 కిలోల బార్బెల్ పడి జిమ్ ట్రైనర్ జ‌స్టిన్ విక్కీ మృతి.. ఇండోనేషియాలోని బాలిలో ఘటన.. వీడియో వైరల్