Credits: Twitter

Newyork, July 22: అమెరికాలోని (America) సూపర్ మార్కెట్లలో (Super market) బియ్యం స్టాక్ (Rice Stock) నిండుకోవడంతో నో స్టాక్ బోర్డులు (No Stock Board) కనిపిస్తున్నాయి. బియ్యం కోసం సూపర్ మార్కెట్ల ముందు ఎన్నారైలు (NRI) భారీ క్యూలు కడుతున్నారు. అసలేం జరిగిందంటే.. బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై భారత్ నిషేధం విధించడంతో అమెరికాలోని ఎన్నారైల్లో తీవ్ర అలజడి చెలరేగింది. భవిష్యత్తులో బియ్యానికి కటకట తప్పదన్న భయంతో ఎన్నారైలు పెద్ద ఎత్తున బియ్యం కొనుగోళ్లకు తెరలేపారు. సూపర్ మార్కెట్ల వద్ద భారతీయులు సోనా మసూరీ బియ్యం కోసం క్యూకట్టిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Gym Trainer Dies: మెడపై 210 కిలోల బార్బెల్ పడి జిమ్ ట్రైనర్ జ‌స్టిన్ విక్కీ మృతి.. ఇండోనేషియాలోని బాలిలో ఘటన.. వీడియో వైరల్

ఉద్యోగాలకు సెలవులు పెట్టి మరీ..

బియ్యం కోసం చాలామంది ఉద్యోగాలకు సెలవులు పెట్టి మరీ సూపర్ మార్కెట్లకు పరుగులు తీశారు. అనుమతి ఉన్న మేరకు గరిష్ఠంగా కొనుగోళ్లకు తెగబడ్డారు. అమెరికా వ్యాప్తంగా ఇదే సీన్ కనిపిస్తోందని అక్కడి వారు చెబుతున్నారు. బియ్యం కొరత తప్పదన్న ఆందోళన భారతీయుల్లో నెలకొందని చెప్పారు.

Road Accident in Bhadradri: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకదానికొకటి వరుసగా ఢీకొన్న నాలుగు వాహనాలు.. డీజిల్ ట్యాంకర్ పగిలి మంటలు.. వీడియోతో