Portable Hospital: ప్రపంచంలో తొలి పోర్టబుల్‌ హాస్పిటల్‌.. 15 వేల అడుగుల ఎత్తు నుంచి కిందకు జారవిడిచిన ఇండియన్‌ ఆర్మీ (వీడియోతో)

ప్రపంచంలోనే మొదటి ‘పోర్టబుల్‌ హాస్పిటల్‌’కు (అవసరమైనప్పుడు తరలించేందుకు అనువుగా) సంబంధించిన ప్రతిష్ఠాత్మక ఆపరేషన్‌ ను భారత ఆర్మీ, వాయుసేన విజయవంతంగా పూర్తిచేశాయి.

Portable Hospital (Credits: X)

Newdelhi, Aug 18: ప్రపంచంలోనే మొదటి ‘పోర్టబుల్‌ హాస్పిటల్‌’కు (Portable Hospital) (అవసరమైనప్పుడు తరలించేందుకు అనువుగా) సంబంధించిన ప్రతిష్ఠాత్మక ఆపరేషన్‌ ను భారత ఆర్మీ (Indian Army), వాయుసేన (IAF) విజయవంతంగా పూర్తిచేశాయి. ఈ దవాఖానను ఒక మారుమూల ప్రాంతానికి సక్సెస్ ఫుల్ గా డెలివరీ చేశాయి. సొంతంగా తయారు చేసిన ఈ పోర్టబుల్‌ హాస్పిటల్‌ను 15 వేల అడుగుల ఎత్తు నుంచి ఐఏఎఫ్‌ కు చెందిన రవాణా విమానం ద్వారా అనుకొన్న లక్షిత ప్రాంతంలో ప్యారాచూట్‌ సాయంతో జారవిడిచినట్టు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.

చేసేది స్వీపర్‌ పని.. అయితే, అతనికి 9 లగ్జరీ కార్లు.. ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉంది. ఉత్తర ప్రదేశ్ పారిశుధ్య కార్మికుడి గురించి తెలుసా?

ఎందుకు?

మారుమూల ప్రాంతాల్లో ఆపత్కాల పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడే లక్ష్యంలో భాగంగా ఈ హాస్పిటల్ ను అభివృద్ధి చేశారు.

ప్రముఖ గాయని పీ సుశీలకు అస్వస్థత.. కడుపు నొప్పితో హాస్పిటల్‌ లో చేరిక.. ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం



సంబంధిత వార్తలు