New Year At Cemetery: శ్మశానంలోని ఊడలమర్రికి వేలాడుతూ దెయ్యాల న్యూఇయర్ సంబురాలు.. పంజాబ్ లో ఘటన.. అసలు ఏం జరిగింది?? వీడియోతో..
వికృత రూపాలతో ఉన్న మాస్క్ లను ముఖానికి ధరించి శ్మశానంలోని ఓ ఊడలమర్రికి వేలాడారు.
Amritsar, Jan 1: శ్మశానంలోని (Cemetery) ఓ ఊడలమర్రికి కొన్ని ఆకారాలు వేలాడుతున్నాయి.. భయంకర శబ్దాలు చేస్తూ ఆటలడుతున్నాయి. ఏంటి రాంగోపాల్ వర్మ (Ram Gopal Verma) సినిమా అనుకుంటున్నారా? కాదండీ.. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో (Amritsar) కొందరు యువకులు కొత్త ఏడాదికి (New Year) వినూత్నంగా స్వాగతం పలికారు. వికృత రూపాలతో ఉన్న మాస్క్ లను ముఖానికి ధరించి శ్మశానంలోని ఓ ఊడలమర్రికి వేలాడారు. సమాధుల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ కేరింతలు కొట్టారు. తర్వాత ఓ సమాధి వద్ద కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకొన్నారు. దీని వెనుక సమాజ హితం ఉంది.
ప్రజల్లో మూఢనమ్మకాలను పారదోలేందుకు ఇడియట్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వారు తెలిపారు.
కొత్త ఏడాది నిరుద్యోగులకు శుభవార్త... మరికొన్ని నోటిఫికేషన్లు విడుదల చేసిన టీఎస్ పీఎస్ సీ