Electric Bike: ఒక్క రీచార్జ్ తో 171 కిలోమీటర్లు.. అదిరిపోయే ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ప్యూర్ ఈవీ మరో రెండు మోటర్ సైకిళ్లను దేశీయ మార్కెట్ కు పరిచయం చేసింది.
Hyderabad, Nov 24: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన (Electric Bike) తయారీ సంస్థ ప్యూర్ ఈవీ (EV) మరో రెండు మోటర్ సైకిళ్లను దేశీయ మార్కెట్ (Domestic Market) కు పరిచయం చేసింది. సింగిల్ చార్జింగ్ తో 171 కిలోమీటర్లు ప్రయాణించే ఈ మోటర్ సైకిల్ ను 110 సీసీ సామర్థ్యంతో సంస్థ రూపొందించింది. ఎకో డ్రైఫిట్ 350 పేరుతో విడుదల చేసిన ఈ బైకు ధరను రూ.1,29,999గా నిర్ణయించింది. 3.5 కిలోవాట్ లీ-అయాన్ బ్యాటరీ కలిగిన ఈ బైకు గంటకు 75 కిలోమీటర్ల వేగంగా దూసుకుపోనున్నదని, రోజువారిగా అత్యధికంగా తిరిగేవారికి ఈ బైకుతో నెలకు రూ.7 వేల వరకు ఆదా కానున్నట్టు కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఈ బైకు దేశవ్యాప్తంగా ఉన్న షోరూంలో అందుబాటులో ఉంచినట్టు, కొనాలనుకునేవారు టెస్ట్ డ్రైవ్ చేసుకోవచ్చునని చెప్పారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)