Actor Brahmaji: సీఎం జ‌గ‌న్ స‌ర్..నేను మీ నాన్నగారి అభిమానిని, మాకు కూడా వరాలవ్వండి, ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌ల తగ్గుద‌ల‌పై సినీన‌టుడు బ్ర‌హ్మాజీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌ల తగ్గుద‌ల‌పై సినీన‌టుడు బ్ర‌హ్మాజీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఓ నెటిజన్ పోస్ట్ చేసిన రెండు ఫొటోల‌ను రీట్వీట్ చేశారు. తెలంగాణ‌లో కారు పార్కింగ్ ధ‌రే రూ.30 ఉంద‌ని, ఏపీలో మాత్రం బాల్క‌నీ టికెట్ ధ‌ర రూ.20, ఫ‌స్ట్ క్లాస్ రూ.15, సెకండ్ క్లాస్ టికెట్ ధ‌ర రూ.10 ఉందంటూ అందులో ఉంది.

Actor Brahmaji (Photo-Twitter)

ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌ల తగ్గుద‌ల‌పై సినీన‌టుడు బ్ర‌హ్మాజీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఓ నెటిజన్ పోస్ట్ చేసిన రెండు ఫొటోల‌ను రీట్వీట్ చేశారు. తెలంగాణ‌లో కారు పార్కింగ్ ధ‌రే రూ.30 ఉంద‌ని, ఏపీలో మాత్రం బాల్క‌నీ టికెట్ ధ‌ర రూ.20, ఫ‌స్ట్ క్లాస్ రూ.15, సెకండ్ క్లాస్ టికెట్ ధ‌ర రూ.10 ఉందంటూ అందులో ఉంది. ఈ ఫొటోల‌నే బ్ర‌హ్మాజీ పోస్ట్ చేశారు. అందులో 'సీఎం జ‌గ‌న్ స‌ర్.. అంద‌రికీ వ‌రాలు ఇస్తారు.. పాపం థియేట‌ర్ల య‌జ‌మానుల‌కు, సినిమా వాళ్ల‌కి కూడా సాయం చేయండి. ఇట్లు మీ మీ నాన్న గారి అభిమాని' అంటూ బ్రహ్మాజీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. కాగా, బ్రహ్మాజీ చేసిన ట్వీట్‌పై నెటిజ‌న్లు సెటైర్లు వేస్తూ రిప్లైలు ఇస్తున్నారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement