RK Roja on Her Daughter: కూతురు సినిమాల్లోకి వస్తుందనే వ్యాఖ్యలపై స్పందించిన రోజా, వారికి ఏది ఇష్టమైతే అదే నాకు ఇష్టమని వెల్లడి

నా కూతురు, కొడుకు సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వస్తే ఎంతో సంతోషంగా ఫీలవుతాను. కానీ నా కూతురికి బాగా చదువుకుని సైంటిస్ట్‌ అవ్వాలన్న ఆలోచన ఉంది. తను చదువు మీదే దృష్టిపెట్టింది. ప్రస్తుతానికైతే తనకు సినిమాల్లోకి వచ్చే ఆలోచనే లేదు

MLA Roja (Photo-Twitter)

ఏపీ పర్యాటక, సాంస్కృతిక, క్రీడల శాఖామంత్రి, సీనియర్‌ నటి రోజా కూతురు అన్షుమాలిక సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుందంటూ కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రూమర్స్‌పై రోజా నోరు విప్పారు.గురువారం నాడు రోజా బర్త్‌డే కావడంతో ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం మీడియాతో మాట్లాడుతూ.. 'యాక్టింగ్‌ చేయడం తప్పని నేనెప్పుడూ చెప్పను. నా కూతురు, కొడుకు సినిమాలపై ఆసక్తితో ఇండస్ట్రీకి వస్తే ఎంతో సంతోషంగా ఫీలవుతాను. కానీ నా కూతురికి బాగా చదువుకుని సైంటిస్ట్‌ అవ్వాలన్న ఆలోచన ఉంది. తను చదువు మీదే దృష్టిపెట్టింది. ప్రస్తుతానికైతే తనకు సినిమాల్లోకి వచ్చే ఆలోచనే లేదు. ఒకవేళ సినిమాల్లోకి వస్తే మాత్రం ఒక తల్లిగా, ఒక హీరోయిన్‌గా ఆశీర్వదిస్తాను. తనకు అండగా నిలబడతాను' అని చెప్పుకొచ్చారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)