Oxygen Plant in Nellore: నెల్లూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన బాలీవుడ్ నటుడు, సోనూసూద్ ఆక్సిజన్ ప్లాంట్‌కు హారతులిచ్చిన నెల్లూరు ప్రజలు, ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేసిన సోనూ
సినీనటుడు సోనూసూద్ సాయంతో ఆక్సిజన్ ప్లాంట్ నెల్లూరుకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు దానికి హారతులు ఇస్తూ, బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకున్న వీడియోను సోనూసూద్ ఈ రోజు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఘనస్వాగతం పలికినందుకు నెల్లూరు ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు సోనూసూద్ పేర్కొన్నారు.
సినీనటుడు సోనూసూద్ సాయంతో ఆక్సిజన్ ప్లాంట్ నెల్లూరుకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడి ప్రజలు దానికి హారతులు ఇస్తూ, బాణసంచా కాల్చుతూ సంబరాలు చేసుకున్న వీడియోను సోనూసూద్ ఈ రోజు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఘనస్వాగతం పలికినందుకు నెల్లూరు ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు సోనూసూద్ పేర్కొన్నారు. ఆక్సిజన్ ప్లాంటు చాలా మంది ప్రాణాలను కాపాడుతుందని ఆయన చెప్పారు.
ఆక్సిజన్ ప్లాంట్ తీసుకొచ్చిన ట్రక్ కు ఉన్న సోనూసూద్ ఫ్లెక్సీకి మహిళలు బొట్లు పెట్టారు. 'థ్యాంక్యూ సోనూసూద్' అంటూ ఉన్న పోస్టర్లను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానికులతో పాటు వైద్యులు, నర్సులు కూడా పాల్గొన్నారు. కాగా, కరోనా రెండో దశ విజృంభణలో ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో చాలామంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దీంతో చలించిపోయిన సోనూసూద్ ఏపీలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తానని చెప్పి, ఆ మాటను నిలబెట్టుకున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)