Chandramukhi-2: ఆసక్తి రేకెత్తిస్తున్న చంద్రముఖి-2 ట్రైలర్.. మీరూ చూడండి

ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘ‌వ లారెన్స్‌, బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగ‌నా ర‌నౌత్ నటించిన భారీ చిత్రం చంద్రముఖి-2.

Chandramukhi-2 (Credits: Youtube Video Grab)

Hyderabad, Sep 4: ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘ‌వ లారెన్స్‌ (Raghava), బాలీవుడ్ ముద్దుగుమ్మ కంగ‌నా ర‌నౌత్ (Kangana Ranaut) నటించిన భారీ చిత్రం చంద్రముఖి-2 (Chandramukhi-2). గతంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన చంద్రముఖి చిత్రాన్ని తెరకెక్కించిన పి.వాసు ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. లైకా ప్రొడ‌క్ష‌న్స్ పై భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 15న తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో, చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ అత్యంత ఆసక్తికరంగా ఉంది. ఓ థ్రిల్లర్ సినిమాకు ఉండాల్సిన హంగులన్నీ చంద్రముఖి-2 చిత్రానికి ఉన్నట్టు ట్రైలర్ చెబుతోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now