AP Floods: వరద బాధితులకు చిరంజీవి రూ. 25 లక్షల సాయం, వరదల విపత్తు బాధిత కుటుంబాలకు అండగా నిలిచిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ వరదల విపత్తు బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. నా వంతూ సాయంగా ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 లక్షలు విరాళం ప్రకటిస్తున్నాను’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏపీలోని పలు జిల్లాలు అతలాకుతలం అయిన సంగతి విదితమే. వరదల్లో (Andhra Pradesh Floods) చిక్కుకుని కొంతమంది ప్రాణాలు కోల్పోగా.. మరికొందరూ ఆర్థికంగా నష్టపోయారు. ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పడు తక్షణ చర్యలు చేపడుతూ ప్రజలకు అండగా నిలుస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వానికి అండగా టాలీవుడ్ నుంచి సినీ ప్రముఖులు తరలి వస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ఆంధ్రప్రదేశ్ వరదల విపత్తు బాధిత కుటుంబాలకు అండగా నిలిచారు. నా వంతూ సాయంగా ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 లక్షలు విరాళం ప్రకటిస్తున్నాను’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)