Chiranjeevi: సీఎం జగన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన చిరంజీవి, చిన్న సినిమాకు ఐదవ షో అవకాశం కల్పించడంపై హర్షం వ్యక్తం చేసిన మెగాస్టార్
‘తెలుగు సినిమా పరిశ్రమకు మేలు కలిగే విధంగా, అటు థియేటర్ల మనుగడను, ప్రజలకి వినోదం అందుబాటులో ఉండాలనే సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకుని, సినిమా టికెట్ రేట్స్ సవరిస్తూ సరికొత్త జీవో జారీ చేసిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి పరిశ్రమ తరుపున కృతజ్ఞతలు.
ఏపీ ప్రభుత్వం మొత్తానికి సినిమా టికెట్ రేట్లకు సంబంధించిన జీవోను విడుదల చేసింది. అందరూ అనుకున్నట్టుగానే రాధే శ్యామ్ సినిమా విడుదల కంటే ముందుగానే ఈ జీవో వచ్చేసింది. ఇందులో టికెట్ రేట్ల అందరికీ ఆమోదయోగ్యంగానే ఉన్నాయి. కనిష్టంగా రూ. 20 ఉంటే.. గరిష్టంగా రూ. 250 ఉంది. అయితే 20 శాతం షూటింగ్‌లు ఏపీలో చేసి ఉండి.. రెమ్యూనరేషన్లు కాకుండా.. సినిమా బడ్జెట్ వంద కోట్లు అయి ఉంటే.. అలాంటి వాటికి టికెట్ రేట్లను పెంచుకునే వెసులు బాటును ఏపీ ప్రభుత్వం కల్పించింది.
ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఈ కొత్త జీవోపై చిరంజీవి స్పందించాడు. ‘తెలుగు సినిమా పరిశ్రమకు మేలు కలిగే విధంగా, అటు థియేటర్ల మనుగడను, ప్రజలకి వినోదం అందుబాటులో ఉండాలనే సంకల్పాన్ని దృష్టిలో పెట్టుకుని, సినిమా టికెట్ రేట్స్ సవరిస్తూ సరికొత్త జీవో జారీ చేసిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారికి పరిశ్రమ తరుపున కృతజ్ఞతలు. చిన్న సినిమాకు ఐదవ షో అవకాశం కల్పించడం ఎందరో నిర్మాతలకు ఉపయోగపడే అంశం. సంబంధిత మంత్రి వర్యులు పేర్ని నాని గారికి, అధికారులకు, కమిటీకి ధన్యవాదాలు’ అని చిరంజీవి పోస్ట్ చేశాడు.