Choodu Nanna Song Out: చూడు నాన్న.. చూస్తున్నావా నాన్న, ఆకట్టుకుంటున్న యాత్ర 2 లేటెస్ట్ సాంగ్, లిరికల్ వీడియో ఇదిగో..
చూస్తున్నావా నాన్న.. నీడలేని నేనా వీళ్ల ధీమా.. ఏమిటీ ఇంతటి ప్రేమా.. నాదారేటో తోచకుంటే నీవెంబడే మేము అంటూ కదిలారు ఏంటో ఆ నమ్మకం.. నేనెలా ఒడ్డుకు చేరడం వీళ్లనెలా ఒడ్డుకు చేర్చడం.. ఇంటిపెద్ద కన్నుమూస్తే అయినవాళ్లు అనాథలేగా నువ్వేలేక ఊరుఊరంతా అనాథలేగా’ అంటూ సాగిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి
ఏపీ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్‌రెడ్డి (YS. Rajashekar) తనయుడు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి (Cm Jagan) నిజ జీవితంలో చోటుచేసుకున్న ఘటనల ఆధారంగా వస్తున్న తాజా చిత్రం యాత్ర 2 (Yatra 2). మహి వి రాఘవ్ (Mahi V Raghav) దర్శకత్వంలో 2019లో వచ్చిన యాత్ర (Yatra) సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం రానుంది.
ఈ సినిమాలో వైఎస్. రాజశేఖర్‌రెడ్డి పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి నటిస్తుండగా.. సీఎం జగన్మోహన్ రెడ్డి పాత్రలో కోలీవుడ్ యాక్టర్ జీవా (Jeeva) నటిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ‘చూడు నాన్న లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. జగన్ చేపట్టిన ఓదర్పుయాత్ర నేపథ్యంలో ఈ పాట ఉండగా ఫుల్ ఎమోషనల్‌గా ఈ పాట సాగింది. భాస్కరభట్ల ఈ పాటకు సాహిత్యం అందించగా.. సంతోష్ నారాయణన్ సంగీతాన్ని సమకుర్చాడు.
లిరిక్స్ విషయానికొస్తే... ‘చూడు నాన్న.. చూస్తున్నావా నాన్న.. నీడలేని నేనా వీళ్ల ధీమా.. ఏమిటీ ఇంతటి ప్రేమా.. నాదారేటో తోచకుంటే నీవెంబడే మేము అంటూ కదిలారు ఏంటో ఆ నమ్మకం.. నేనెలా ఒడ్డుకు చేరడం వీళ్లనెలా ఒడ్డుకు చేర్చడం.. ఇంటిపెద్ద కన్నుమూస్తే అయినవాళ్లు అనాథలేగా నువ్వేలేక ఊరుఊరంతా అనాథలేగా’ అంటూ సాగిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి
Here's Song
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)