Kajol Deep Fake Video: కలకలం రేపుతున్న కాజోల్ డీప్ ఫేక్ వీడియో.. బట్టలు మార్చుకుంటున్నట్టుగా నకిలీ వీడియో (వీడియో)
ఇటీవల డీప్ ఫేక్ వీడియోల బెడద ఎక్కువైంది. ఏఐ సాంకేతిక పరిజ్ఞానం విసృతస్థాయిలో అందుబాటులోకి వచ్చాక డీప్ ఫేక్ వీడియోలు రూపొందించడం పెరిగింది. మొన్న రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో ఎంత కలకలం రేపిందో తెలిసిందే.
Newdelhi, Nov 17: ఇటీవల డీప్ ఫేక్ వీడియోల (Deep Fake Video) బెడద ఎక్కువైంది. ఏఐ (AI) సాంకేతిక పరిజ్ఞానం విసృతస్థాయిలో అందుబాటులోకి వచ్చాక డీప్ ఫేక్ వీడియోలు రూపొందించడం పెరిగింది. మొన్న రష్మిక మందన్న (Rashmika Mandanna) డీప్ ఫేక్ వీడియో ఎంత కలకలం రేపిందో తెలిసిందే. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ డీప్ ఫేక్ వీడియో వైరల్ అవుతోంది. కాజోల్ బట్టలు మార్చుకుంటున్న దృశ్యాలతో ఈ వీడియో ఉంది. టిక్ టాక్ స్టార్ రోజీ బీరీన్స్ ముఖం స్థానంలో కాజోల్ ముఖాన్ని మార్ఫింగ్ చేసి ఈ డీప్ ఫేక్ వీడియో రూపొందించినట్టు తెలుస్తోంది. ఎండాకాలంలో ఎలాంటి దుస్తులు ధరించాలో చూపిస్తూ రోజీ బీరీన్స్ చేసిన వీడియోను కాజోల్ ముఖంతో మార్చివేశారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)