Shivani Rajasekhar (Photo-Insta)

హీరో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్, రాహుల్ విజయ్,  శివాని  రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా  కోట బొమ్మాళి పీఎస్. ఈ నెల 24 వ తేదీన  థియేటర్స్ లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో కోట బొమ్మాళి పీఎస్ టీమ్ ప్రమోషన్లలో ఫుల్ బిజీగా గడుపుతుంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు రాహుల్ విజయ్ ని, శివాని  రాజశేఖర్ ని పిలవడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో శివాని తన కుటుంబం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఆమె మాట్లాడుతూ.. గతంలో మా కుటుంబానికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియాలో చాలా బయటకు వచ్చాయి.  అమ్మనాన్నలు అరెస్టు అయ్యారంటూ ఒక్కొక్కరూ ఒక్కొక్కవిధంగా తమకు తోచినట్లుగా రాసారు. పుకార్లను అనేక రకాలుగా వ్యాప్తి చేశారు.  అసలు అమ్మనాన్నలు జైలుకి వెళ్లలేదు. వాళ్లిద్దరూ ఇంట్లో సంతోషంగా ఉన్నారని శివాని వ్యక్తం చేసింది.

పిల్లాడిని కొట్టిన ఘటనపై స్పందించిన నానా పటేకర్, నేను ఇలాంటివి ఎప్పటికీ చేయను తప్పు చేసి ఉంటే క్షమించాలంటూ వీడియో

మా అమ్మనాన్నలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. చాలా నిజాయితీగా ఉంటారన్న విషయం ఎవరికి తెలియదు. ఎప్పుడైన వాళ్లకి ఎలాంటి  సమస్య వచ్చినా  భయపడకుండా ఫేస్ చేశారన్న విషయం నాకు మాత్రమే తెలుసు. అయితే దీనిపై  రకరకాలైన పుకార్లు వస్తున్నాయి.. పోతున్నాయి. మేము మాత్రం మా పనిని చాలా కాన్ఫిడెంట్ గా చేస్తూ ముందుకు వెళుతున్నాము అని.. ఆ ఇంటర్వ్యూలో తాజాగా శివాని చెప్పుకొచ్చింది.