Dulquer Salmaan: నా వెనుక చేతులు వేసి ‘అక్కడ’ ఓ పెద్దావిడ నన్ను అసభ్యకరంగా తాకింది.. అప్పుడు చాలా ఇబ్బంది పడ్డా.. స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సంచలన వ్యాఖ్యలు

అభిమానులు అప్పుడప్పుడూ తారలను ఇబ్బందుల పాలు కూడా చేస్తుంటారు. తనకు సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైందని ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ చెప్పాడు. స్టేజ్‌పై ఉన్నప్పుడు ఓ మహిళ ప్రవర్తన కారణంగా ఇబ్బంది పడ్డానని ఇటీవలి ఓ ఇంటర్వ్యూ లో ఆయన చెప్పుకొచ్చాడు.

Dulquer Salmaan (Photo-Instagram)

Newdelhi, Aug 20: అభిమానులు అప్పుడప్పుడూ తారలను ఇబ్బందుల పాలు కూడా చేస్తుంటారు. తనకు సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైందని ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) చెప్పాడు. స్టేజ్‌పై (Stage) ఉన్నప్పుడు ఓ మహిళ ప్రవర్తన కారణంగా ఇబ్బంది పడ్డానని ఇటీవలి ఓ ఇంటర్వ్యూ (Interview) లో ఆయన చెప్పుకొచ్చాడు. ‘‘ఓకే కన్మని’, ‘సీతారామం’ తరువాత నాకు కేరళలో లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. కొంతమంది మహిళలు ఫొటో తీసుకుంటానంటూ బుగ్గపై కిస్ చేయాలని చూస్తుంటారు. వాళ్ల ప్రవర్తన ఆశ్యర్యం కలిగిస్తుంటుంది. గతంలో ఓ పెద్దావిడ నా పిరుదులపై చెయ్యి వేసి గట్టిగా నొక్కింది. ఆ ప్రాంతమంతా నన్ను అసభ్యకరంగా తాకింది. ఎంతో ఇబ్బందిపడ్డా. అప్పుడు ఏం చెయ్యాలో తెలియలేదు’ అని దుల్కర్ సల్మాన్ చెప్పుకొచ్చారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement