Allu Arjun in Khairatabad RTO office: ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయానికి అల్లు అర్జున్, పుష్ప 2 కోసమేనని వార్తలు
అయితే బన్నీ అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయంకి హీరో అల్లు అర్జున్ వచ్చారు.దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే బన్నీ అంతర్జాతీయ డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేయడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఇతర దేశాల్లో రోడ్ ట్రిప్ వెళ్లేవారు తప్పనిసరిగా ఈ లైసెన్స్ తీసుకుంటారు.విదేశాల్లో పుష్ప-2 షూటింగ్ కోసమే లైసెన్స్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో జపాన్‌లో పుష్ప-2 షూటింగ్ జరగనుందని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. కొత్త షెడ్యూల్ కోసం గోవాకు బయలు దేరిన దేవర టీం, సోషల్ మీడియాలో వీడియో వైరల్
అందుకోసమే దరఖాస్తు చేసి ఉండవచ్చని అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం పుష్ప-2 షూటింగ్ షెడ్యూల్ నంద్యాల జిల్లాలోని యాగంటి క్షేత్రంలో జరుగుతోంది. అక్కడ ఆలయంలో రష్మిక మందన్నాపై ముఖ్యమైన సీన్స్ తెరకెక్కించారు. దీనికి సంబంధించిన ఫోటోలను రష్మిక ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఇప్పటికే పుష్ప-2 సినిమాను ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు సుకుమార్ ప్రకటించారు. ఈ మూవీ వాయిదా పడే ఛాన్స్ లేదని గతంలోనే చెప్పారు.
Here's Pics
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)