ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ దేవరను కొరటాల శివ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్ కథానాయిక. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా మంగళవారం నుంచి గోవాలో కొత్త షెడ్యూల్ ప్రారంభించుకోనుంది. ఇందుకోసం తారక్ సోమవారమే అక్కడికి చేరుకున్నారు. దాదాపు పదిరోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో భాగంగా ఓ పాటతో పాటు కొన్ని కీలక సన్నివేశాల్ని చిత్రీకరించనున్నట్లు సమాచారం. దీంట్లో తారక్, జాన్వీలతో పాటు మిగిలిన ప్రధాన తారాగణం పాల్గొననున్నట్లు తెలిసింది. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుండగా.. తొలి భాగం ‘దేవర పార్ట్ 1’ పేరుతో అక్టోబరు 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. సంగీతం: అనిరుధ్, ఛాయాగ్రహణం: రత్నవేలు.
Here's Video
#JrNTR is off to Goa for the #Devara song shoot and a few other sequences. #JanhviKapoor and #SaifAliKhan are also part of this schedule. pic.twitter.com/9rG1MILeRT
— Gulte (@GulteOfficial) March 18, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)