Prabhas in Mogalthur: వీడియోలు, ప్రభాస్ రాకతో జన సంద్రమైన మొగల్తూరు, కృష్ణంరాజు స్వగృహంలో నిర్వహించిన సంస్మరణ సభకు హాజరైన ప్రభాస్ సహా కుటుంబ సభ్యులు
దివంగత నటుడు కృష్ణంరాజు (Krishnam Raju) సంస్మరణ సభ సందర్భంగా మొగల్తూరు జన సంద్రాన్ని తలపించింది. ఇటీవల కన్నుమూసిన కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమాన్ని ప్రభాస్ సహా కుటుంబ సభ్యులు స్వగృహంలో గురువారం నిర్వహించారు
దివంగత నటుడు కృష్ణంరాజు (Krishnam Raju) సంస్మరణ సభ సందర్భంగా మొగల్తూరు జన సంద్రాన్ని తలపించింది. ఇటీవల కన్నుమూసిన కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమాన్ని ప్రభాస్ సహా కుటుంబ సభ్యులు స్వగృహంలో గురువారం నిర్వహించారు. ప్రభాస్ వస్తున్నాడనే విషయం తెలియడంతో చుట్టు పక్కల గ్రామాల వారితోపాటు సుదూర ప్రాంతాలకు చెందిన అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
వీరిలో పలువురు ప్రభాస్ చూసేందుకు చెట్లపైన, ఎత్తైన భవంతులపైకెక్కారు. సెక్యూరిటీ దృష్ట్యా ప్రభాస్ తమ ఇంటిలో నుంచే అభిమానులకు అభివాదం చేసి, వారిలో ఉత్సాహం నింపారు. వచ్చిన ప్రతి ఒక్కరూ భోజనం చేసి వెళ్లాలని ప్రభాస్ కోరారు. సంబంధిత ఫొటోలు, వీడియోలతో నెట్టింట #PrabhasatMogalthuru హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లో నిలిచింది.
Here's Trending Videos:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)