Guntur Karam Ticket Price Hike: గుంటూరు కారం టికెట్ ధరపై రూ.50 పెంచుకునేందుకు అనుమతించిన ఏపీ ప్రభుత్వం, జీవో ఇదిగో..
టికెట్ల ధరలను పెంచుకునేందుకు, అలాగే బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గుంటూరు కారం’ జనవరి 12న ఆడియన్స్ ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇటీవలే తెలంగాణ గవర్నమెంట్ ఈ చిత్రానికి.. టికెట్ల ధరలను పెంచుకునేందుకు, అలాగే బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది. సింగిల్ స్రీన్స్‌లలో రూ.65, మల్టీఫెక్స్‌లలో రూ.100 పెంపుకి, రాష్ట్రంలో 23 చోట్ల 12వ తేదీ అర్థరాత్రి 1 గంట షోకు, అలాగే 12 నుంచి 18వ తేదీ వరకు ఉదయం 4 గంటలకు షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
తాజాగా ఏపీ గవర్నమెంట్ కూడా టికెట్ ధరల పెంపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ప్రతి టికెట్ పై రూ.50 పెంచుకునేందుకు వెసులు బాటు కల్పిస్తూ జీవోను జారీ చేసింది. రిలీజ్ తేదీ నుంచి పది రోజుల పాటు పెంచిన ధరలతో గుంటూరు కారం టికెట్స్ విక్రయించబడతాయి. అయితే అదనపు షోలకు సంబంధించి మాత్రం.. ఏపీ ప్రభుత్వం ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)