Manchu Family Dispute: మనోజ్.. నిన్ను అల్లారుముద్దుగా పెంచాను, భార్య మాటలు విని నా గుండెలపై తన్నావంటూ ఆడియో విడుదల చేసిన మోహన్ బాబు
ఈ ఆడియోలో మనోజ్ నిన్ను నేను అల్లారుముద్దుగా పెంచాను. నీ చదువు కోసం కూడా చాలా ఖర్చు పెట్టాను, కానీ నువ్వు భార్య మాటలు విని నా గుండెల మీద తన్నావు.
గత రెండు రోజులుగా కుటుంబంలో జరుగుతున్న వివాదం నేపథ్యంలో మోహన్ బాబు స్వయంగా ఒక ఆడియో రిలీజ్ చేయడం సంచలనం రేపుతోంది.. ఈ ఆడియోలో మనోజ్ నిన్ను నేను అల్లారుముద్దుగా పెంచాను. నీ చదువు కోసం కూడా చాలా ఖర్చు పెట్టాను, కానీ నువ్వు భార్య మాటలు విని నా గుండెల మీద తన్నావు. అంటూ మోహన్ బాబు మాట్లాడుతున్నారు. సుమారు 11 నిమిషాల నిడివి ఉన్న ఈ ఆడియోలో అనేక అంశాలను మోహన్ బాబు ప్రస్తావించారు.
మనోజ్ నువ్వు నా బిడ్డ వి.. నిన్ను ఎలా పెంచాను రా నేను అందరికంటే నిన్నే గారాబంగా పెంచాను. నీకే ఎక్కువ ఖర్చు పెట్టి చదివించాలని ప్రయత్నం చేశాను. నువ్వు ఏది అడిగినా అది నేను తెచ్చి ఇచ్చాను కానీ ఈ రోజున నువ్వు చేస్తున్న పని బిడ్డలు గుండెల మీద తంతారు అంటారే.. అలా తన్నావురా. మనసు ఆవేదనతో కృంగిపోతోంది రా నేను మీ అమ్మ ఏడ్చుకుంటున్నామంటూ మోహన్ బాబు ఎమోషనల్ అయ్యారు.
Mohan Babu released an audio addressing Manchu Manoj
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)