Chiranjeevi Praises CM YS Jagan Govt: జగన్ సర్కారుపై హీరో చిరంజీవి ప్రశంసల జల్లు, రికార్డు స్థాయి వ్యాక్సినేషన్‌‌పై హర్షం వ్యక్తం చేసిన మెగాస్టార్, ముఖ్యమంత్రి ఆదర్శవంతమైన పరిపాలన కొనసాగిస్తున్నారంటూ అభినందనలు

ఏపీలో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్‌ చేపట్టడం పట్ల మెగాస్టార్‌ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఓకే రోజు 13.72 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు.

Megastar Chiranjeevi | Sye Raa Narasimha Reddy | Lucifer Remake | Photo - Twitter

ఏపీలో రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్‌ చేపట్టడం పట్ల మెగాస్టార్‌ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఓకే రోజు 13.72 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయించిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురిపించారు. కోవిడ్‌ మహమ్మారి కట్టడి కోసం ఏపీ వైద్య ఆరోగ్య శాఖ చేస్తున్న ప్రయత్నాన్ని సోషల్‌ మీడియా వేదికగా అభినందించారు. కోవిడ్‌ నియంత్రణ కోసం ఏపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నం దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. ఆదర్శవంతమైన పరిపాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి శుభాకాంక్షలు అంటూ చిరంజీవి ట్వీట్‌ చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now