Nithya Menen: స్టార్ హీరోయిన్ నిత్య మేనన్ ఇంట్లో పెను విషాదం.. నిత్య అమ్మమ్మ మృతి.. సోషల్ మీడియాలో వెల్లడి.. ఒక శకం ముగిసిందంటూ తీవ్ర భావోద్వేగం
ఆమె అమ్మమ్మ మృతి చెందారు. నిత్య మేనన్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. ఒక శకం ముగిసిందని వ్యాఖ్యానించారు.
Hyderabad, July 16: ప్రముఖ నటి నిత్య మేనన్ (Nithya Menen) ఇంట్లో పెను విషాదం సంభించింది. ఆమె అమ్మమ్మ మృతి చెందారు. నిత్య మేనన్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో (Social Media) వెల్లడించారు. ఒక శకం ముగిసిందని వ్యాఖ్యానించారు. ‘‘గుడ్ బై అమ్మమ్మా.. నిన్ను చాలా మిస్ అవుతా’’ అని ఇన్‌స్టాలో (Insta) రాసుకొచ్చారు. తాను అమ్మమ్మ చెంతనున్న ఓ ఫొటోను షేర్ చేశారు. ‘అలా మొదలైంది’ మూవీతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన నిత్య తొలి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నారు. ఆ తరువాత నితిన్ సరసన నిత్య నటించిన ‘ఇష్క్’ ఆమెకు యువతలో అద్భుతమైన క్రేజ్ తెచ్చింది. తెలుగుతో పాటూ కన్నడ, తమిళం, మలయాళంలో దాదాపు 50 సినిమాల్లో ఆమె తళుక్కుమంది. క్యారెక్టర్ ఉన్న పాత్రలనే ఎంపిక చేసుకుంటుందని నిత్యకు ఇండస్ట్రీలో మంచి పేరు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)