Charan Tour: ఆఫ్రికాలో చరణ్ దంపతుల విహారం.. అభిమానుల కోసం వీడియో విడుదల.. ఇటీవలే టాంజానియాలో పర్యటించిన రామ్ చరణ్, ఉపాసన.. తాజాగా ఆఫ్రికాకు సంబంధించినదే మరో వీడియో విడుదల
చాలా రోజులుగా వీరు అక్కడి పలు ప్రాంతాలను సందర్శిస్తూ మరపురాని జ్ఞాపకాలను పోగేసుకుంటున్నారు.
Hyderabad, Nov 5: నటుడు రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన ఆఫ్రికా దేశాల పర్యటనలో ఉన్నారు. చాలా రోజులుగా వీరు అక్కడి పలు ప్రాంతాలను సందర్శిస్తూ మరపురాని జ్ఞాపకాలను పోగేసుకుంటున్నారు. టాంజానియాలోని ఓ సఫారీలో సింహాలను దగ్గరుండి రామ్ చరణ్ ఫొటోలు తీస్తున్న వీడియోను ఆయనే స్వయంగా కొన్ని రోజుల క్రితం ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయడం తెలిసిందే. బహిరంగ ప్రదేశంలో ఆమ్లెట్ కూడా వేశాడు. తమ పర్యటనకు సంబంధించి తాజా దృశ్యాలతో కూడిన షార్ట్ వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో ఉపాసన పోస్ట్ చేశారు. ఇందులో ఎక్కువ సింహాలు కనిపిస్తున్నాయి. అలాగే, రామ్ చరణ్, ఉపాసన నేలపై సేద తీరడం, ఓ చెట్టు దగ్గరకు చేరి ఫొటోలు తీసుకోవడం ఈ వీడియోలో చూడొచ్చు. గత నెల 20న జపాన్ వెళ్లిన ఈ జంట అటు నుంచి అటే ఆఫ్రికాకు వెళ్లి.. అక్కడి అందాలను దర్శించుకుంటోంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)