Rashmika Mandanna: మేనేజర్ మోసం వార్తలపై స్పందించిన నటి రష్మిక.. తమ మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని పేర్కొన్న నటి
తన వ్యక్తిగత మేనేజర్ మోసం చేశారని, తమ మధ్య కలహాలు వచ్చాయంటూ వచ్చిన వార్తలపై రష్మిక తాజాగా స్పందించారు.
Hyderabad, June 23: విభిన్న పాత్రలతో నటిగా దూసుకుపోతున్న నటి రష్మిక మందన్న(Rashmika Mandanna) కు సంబంధించి ఇటీవల కొన్ని వార్తలు (News) నెట్ లో (Internet) హల్ చల్ చేశాయి. తన వ్యక్తిగత మేనేజర్ (Manager) మోసం చేశారని, తమ మధ్య కలహాలు వచ్చాయంటూ వచ్చిన వార్తలపై రష్మిక (Rashmika) తాజాగా స్పందించారు. తమ మధ్య ఎలాంటి శత్రుత్వం లేదని, కెరీర్ లో ఎవరికి వారు ఎదగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. పరస్పర అంగీకారంతో తాము విడిపోతున్నామని, తాము ప్రొఫెషనల్స్ మని, ఎక్కడైనా పనికి కట్టుబడి ఉంటామన్నారు. రష్మికను మేనేజర్ ఆర్థికంగా మోసం చేశారని, ఆమెకు తెలియకుండా రూ.80 లక్షలు కాజేసినట్లు బాలీవుడ్ లో వార్తలు వచ్చాయి. విషయం తెలియడంతో రష్మిక అతనిని తొలగించిందంటూ కూడా మీడియాలో వచ్చింది. ఈ నేపథ్యంలో రష్మిక పై విధంగా స్పందించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)