Mahesh, Allu Arjun (Credits: Google)

Hyderabad, June 23: టాలీవుడ్ సూపర్ స్టార్ (Tollywood Superstar) మహేష్ (Mahesh), ఐకాన్ స్టార్ (Icon Star) అల్లు అర్జున్ (Allu Arjun) స్టార్ డమ్ గురించి ప్రత్యేకించి చెప్పాలా..? వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటూ.. టాప్ హీరోలుగా దూసుకుపోతున్నారు ఈ ఇద్దరు. ఇక సినిమాలు ఒక్కటేనా.. యాడ్స్, బ్రాండ్ ప్రమోషన్, బిజినెస్ మెన్ గానూ తమ కెపాసిటీ ఏంటో అందరికి ఇప్పటికే రుచి చూపించారు. ఇప్పటికే పలు వ్యాపార సంస్థలు ఉన్న మహేష్, అర్జున్ మరి కొన్ని కంపెనీ లకు బ్రాండ్ అంబాసిడర్లుగా కూడా ఉన్నారు. ఇక, మల్టీప్లెక్స్ రంగంలోనూ మహేష్ అడుగు పెట్టి హైదరాబాద్‌లో ఏఎంబీ పేరుతో మల్టీప్లెక్స్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Srivani Trust: శ్రీవాణి ట్రస్ట్‌ లో అక్రమాల ఆరోపణలు.. శ్వేతపత్రం విడుదల చేసిన సుబ్బారెడ్డి.. మే 31 నాటికి రూ. 861 కోట్ల ఆదాయం వచ్చిందని వెల్లడి

అర్జున్ మల్టీప్లెక్స్

ఇక ఇదే తరహాలో అల్లు అర్జున్‌ కూడా మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఇప్పటికే రెస్టారెంట్‌తో పాటు ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టిన బన్నీ.. అమీర్ పేట్ లోని ఓల్డ్ సత్యం థియేటర్ ప్రాంతంలో ఏఏఏ మల్టీప్లెక్స్‌ స్థాపించి  మల్టీప్లెక్స్ రంగంలోకి అడుగుపెట్టారు. దీంతో మహేష్, అల్లు అర్జున్ బిజినెస్ లో పోటీపడుతున్నారని నెటిజన్లు అంటున్నారు.

Titanic Tourist Submarine Rescue Operation: నీటి అడుగున శబ్దాలను గుర్తించిన కెనడియన్ పి-3 విమానం, టైటానిక్ శిథిలాలను చూసేందుకు వెళ్లిన టూరిస్ట్ సబ్ మెరైన్ వెతుకులాటలో పురోగతి