Shahrukh Khan at Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న షారుఖ్ ఖాన్.. భార్య, కుమార్తె, నటి నయనతారతో కలిసి శ్రీవారి దర్శనం
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తన కుటుంబంతో కలిసి నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భార్య గౌరీ ఖాన్, కుమార్తె సుహానా ఖాన్, నటి నయనతారతో కలిసి ఆయన సుప్రభాత సేవలో పాల్గొన్నారు.
Hyderabad, Sep 5: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Shahrukh Khan) తన కుటుంబంతో కలిసి నేడు తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. భార్య గౌరీ ఖాన్, కుమార్తె సుహానా ఖాన్, నటి నయనతారతో (Nayanatara) కలిసి ఆయన సుప్రభాత సేవలో పాల్గొన్నారు. తొలుత దేవస్థానం అధికారులు షారుఖ్ కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ఆ తరువాత షారుఖ్ గర్భాలయంలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. షారుఖ్ నటించిన ‘జవాన్’ చిత్రం ఈ నెల 7న విడుదల కానుండటంతో ఆయన తిరుమలకు వచ్చినట్టు తెలుస్తుంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)