Christian Oliver No more: సముద్రంలో కూలిన విమానం.. ఇద్దరు కూతుళ్లతో సహా హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఓలివర్ దుర్మరణం
హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఓలివర్ గురువారం విమాన ప్రమాదంలో మృతి చెందారు. తన ఇద్దరు కూతుళ్లతో (10, 12 ఏళ్ల వయసున్న బాలికలు) కలిసి ఆయన ప్రయాణిస్తున్న విమానం కరీబియన్ సముద్రంలో కూలడంతో అందరూ మరణించారు.
Newyork, Jan 6: హాలీవుడ్ నటుడు క్రిస్టియన్ ఓలివర్ (Christian Oliver) గురువారం విమాన ప్రమాదంలో (Plane Crash) మృతి చెందారు. తన ఇద్దరు కూతుళ్లతో (10, 12 ఏళ్ల వయసున్న బాలికలు) కలిసి ఆయన ప్రయాణిస్తున్న విమానం (Plane) కరీబియన్ సముద్రంలో కూలడంతో అందరూ మరణించారు. ఈ మేరకు సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడీన్స్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. జర్మనీ సంతతికి చెందిన ఓలివర్ తన కెరీర్‌లో 60కి పైగా సినిమాలు, టీవీ సీరియళ్లలో నటించారు. ప్రముఖ నటుడు టామ్ క్రూయిజ్ నటించిన వాల్కరీ మూవీలోనూ ఓ పాత్ర పోషించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)