SS Rajamouli: సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన రాజమౌళి, సినిమా పరిశ్రమ పునరుద్ధరణకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని ఆశిస్తున్నామంటూ ట్వీట్
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరల పెంపుతో పాటు పలు నిర్ణయాలు తీసుకుని ఇటీవలే వైసీపీ సర్కారు జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు తెలంగాణ ప్రభుత్వం కూడా సినిమా టికెట్ల ధరలను పెంచింది. దీంతో ఇరు రాష్ట్రాల సీఎంలకు దర్శకుడు రాజమౌళి ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరల పెంపుతో పాటు పలు నిర్ణయాలు తీసుకుని ఇటీవలే వైసీపీ సర్కారు జీవో విడుదల చేసిన విషయం తెలిసిందే. అంతకు ముందు తెలంగాణ ప్రభుత్వం కూడా సినిమా టికెట్ల ధరలను పెంచింది. దీంతో ఇరు రాష్ట్రాల సీఎంలకు దర్శకుడు రాజమౌళి ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలిపారు. సినిమా టికెట్ల ధరలను సవరిస్తూ కొత్త జీవో విడుదల చేసి తెలుగు చలనచిత్ర రంగానికి సాయం చేసినందుకు ఏపీ సీఎం వైఎస్ జగన్, మంత్రి పేర్ని నాని గారికి థ్యాంక్స్. సినిమా పరిశ్రమ పునరుద్ధరణకు ఈ నిర్ణయం తోడ్పడుతుందని ఆశిస్తున్నాను'' అని రాజమౌళి ట్వీట్ చేశారు. కాగా, కరోనా వల్ల సినీ రంగం ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
మరోవైపు, తెలంగాణ ప్రభుత్వానికి కూడా రాజమౌళి కృతజ్ఞతలు తెలిపారు. ''థియేటర్లలో విడుదలయ్యే పెద్ద సినిమాలకుగాను ఐదవ ఆటకు అనుమతులు ఇచ్చినందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు. అలాగే, మాకు సాయపడుతోన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కూడా థ్యాంక్స్. ఈ సాయం సినీ రంగానికి బాగా ఉపయోగపడుతుంది'' అని రాజమౌళి చెప్పారు. కాగా, రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)