Mahesh Babu: సీఎం వైఎస్ జగన్‌కు ధన్యవాదాలు తెలిపిన మహేష్ బాబు, సినిమా టిక్కెట్ ధరలను పెంచుతూ కొత్త జీవోను జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
కొత్త జీవో, సవరించిన టిక్కెట్ రేట్ల ద్వారా మా సమస్యలను విని వాటిని పరిష్కరించినందుకు ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పేర్ని నాని గారు రాబోయే రోజుల్లో ప్రభుత్వం మధ్య పరస్పర బలమైన, ఆరోగ్యకరమైన సపోర్ట్ కోసం మేము ఎదురు చూస్తున్నాము” అని మహేష్ ట్వీట్ చేశాడు.
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం కొత్త జీవోను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా ఇప్పుడు వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ సూపర్‌స్టార్ మహేష్ బాబు ట్విట్టర్‌లో స్పందించారు.
కొత్త జీవో, సవరించిన టిక్కెట్ రేట్ల ద్వారా మా సమస్యలను విని వాటిని పరిష్కరించినందుకు ఏపీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. పేర్ని నాని గారు రాబోయే రోజుల్లో ప్రభుత్వం మధ్య పరస్పర బలమైన, ఆరోగ్యకరమైన సపోర్ట్ కోసం మేము ఎదురు చూస్తున్నాము” అని మహేష్ ట్వీట్ చేశాడు. మహేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. కొన్ని రోజుల క్రితం చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో కూడిన టాలీవుడ్ బృందం తెలుగు చిత్రసీమ సమస్యలను ఏపీ ముఖ్యమంత్రి ముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)