Indira Devi Passes Away: శోక సంద్రంలో సూపర్ స్టార్స్, మహేష్ బాబు తల్లి, సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి ఇందిరాదేవి కన్నుమూత

సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి, మహేశ్‌బాబు తల్లి ఘట్టమనేని ఇందిరా దేవి(70) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని నివాసంలో బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

Mahesh Babu's mother Indira Devi passes away

టాలీవుడ్‌లో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి, మహేశ్‌బాబు తల్లి ఘట్టమనేని ఇందిరా దేవి(70) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్‌లోని నివాసంలో బుధవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఇందిరా దేవికి ర‌మేష్ బాబు, మహేష్ బాబు, ప‌ద్మావ‌తి, మంజుల, ప్రియదర్శిని ఐదుగురు సంతానం.

అభిమానుల సందర్శనార్థం ఇందిరా దేవీ భౌతిక కాయాన్ని పద్మాలయ స్టూడియోస్‌కి తరలిస్తారు. మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.కాగా ఈ ఏడాది జనవరిలోనే రమేశ్‌ బాబు(56) మృతిచెందారు. ఏడాది తిరగకముందే ఇందిరా దేవి కూడా కన్నుమూయడం కృష్ణ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. కాగా.. ఇందిరా దేవి మృతిపట్ల పలువురు సంతాపం తెలిపారు. తీవ్ర దుఃఖంలో ఉన్న కృష్ణ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)