Godfather Movie Update: చిరంజీవి సినిమాలో సల్మాన్ ఖాన్, గాడ్‌ఫాదర్‌ చిత్రంలో నటించనున్న బాలీవుడ్‌ స్టార్‌ హీరో, ట్విట్టర్ ద్వారా తెలిపిన మెగాస్టార్

తెలుగు సినిమాలో మరో సంచలనానికి తెరలేచింది. 'గాడ్‌ఫాదర్‌' మూవీలో ఇద్దరు అగ్రనటులు కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నారు. మోహన్‌రాజా దర్శకత్వంలో చిరంజీవి గాడ్‌ఫాదర్‌ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్‌ హిట్‌ లూసిఫర్‌కి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది.

Superstar Salman Khan joins the sets of Chiranjeevi's 'Godfather'!(Photo-Twitter)

తెలుగు సినిమాలో మరో సంచలనానికి తెరలేచింది. 'గాడ్‌ఫాదర్‌' మూవీలో ఇద్దరు అగ్రనటులు కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నారు. మోహన్‌రాజా దర్శకత్వంలో చిరంజీవి గాడ్‌ఫాదర్‌ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మలయాళ సూపర్‌ హిట్‌ లూసిఫర్‌కి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. కాగా ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ నటించనున్నాడు.

ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. మీ రాక ప్రతి ఒక్కరినీ ఉత్తేజపరిచింది. ఉత్సాహాన్ని నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకెళ్లింది. మీతో స్క్రీన్‌ని పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీ ప్రజెన్స్ ప్రేక్షకులకు అద్భుతమైన కిక్‌ని ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు' అంటూ సల్మాన్‌కి గ్రాండ్‌ వెల్కమ్‌ చెప్పారు చిరు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now