Telugu States Floods: భారీ వరదలు, తెలుగు రాష్ట్రాలకు రూ. 50 లక్షలు విరాళం ప్రకటించిన దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ

తమ సొంత నిర్మాణ సంస్థలైన హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ పేర్లతో రూ. 50 లక్షలు ప్రకటించారు.

Trivikram-srinivas-director (Photo-Wikimedia commons)

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలుగు రాష్ట్రాలు వరదముంపులో చిక్కుకున్నాయి. ఇలాంటి విపత్తు సమయంలో ప్రజలకు సాయం చేసేందుకు టాలీవుడ్‌ చిత్రపరిశ్రమ నుంచి పలువురు ముందుకొస్తున్నారు. మొదట జూనియర్‌ ఎన్టీఆర్‌ రూ. 1 కోటి సాయం ప్రకటించిన తర్వాత ఒక్కొక్కరు తమ వంతుగా సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. భారీ వర్షాల వల్ల నష్టపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌, నిర్మాతలు రాధాకృష్ణ, నాగవంశీ సాయం ప్రకటించారు. తమ సొంత నిర్మాణ సంస్థలైన హారిక అండ్ హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ పేర్లతో రూ. 50 లక్షలు ప్రకటించారు. తెలంగాణకు రూ. 25లక్షలు, ఏపీకి రూ. 25 లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ విపత్తు వల్ల ఆస్తి, ప్రాణ నష్టాలు తమను ఎంతగానో కలచి వేశాయని వారు చెప్పుకొచ్చారు. బాధితులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ఒక నోట్‌ విడుదల చేశారు.  భారీ వరదలు,  తెలుగు రాష్ట్రాలకు హీరో సిద్దు జొన్నలగడ్డ రూ. 30 లక్షలు సాయం, వరదలు ముంచెత్తడం బాధాకరమని ట్వీట్

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)