Vijay Built Sai Baba Temple: విజయన్నా.. నువ్వు సూపర్.. తల్లి కోసం సాయిబాబా గుడి కట్టించిన తమిళ సినీ నటుడు విజయ్
తన తల్లి చిరకాల కోరికను తీర్చారు తమిళ సినీనటుడు విజయ్. ఆమె కోరుకున్న విధంగా సాయిబాబా గుడి కట్టించారు.
Newdelhi, Apr 13: తన తల్లి చిరకాల కోరికను తీర్చారు తమిళ సినీనటుడు విజయ్ (Kollywood Actor Vijay). ఆమె కోరుకున్న విధంగా సాయిబాబా గుడి (Sai Baba Temple) కట్టించారు. ఈ విషయాన్ని ఆయన తల్లి శోభ స్వయంగా తెలిపారు. తన కోసం విజయ్ గుడి కట్టించాడంటూ ప్రచారం అవుతున్న వార్త నిజమేనని అన్నారు. ఇటీవల విజయ్ చెన్నైలోని ఓ సాయిబాబా ఆలయాన్ని సందర్శించారు. ఆ సందర్భంగా పూజారులతో కలిసి ఫొటోలు దిగారు. ఇది నెట్టింట వైరల్ గా మారడంతో పాటూ ఆలయాన్ని విజయ్ కట్టించారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో, విజయ్ తల్లి శోభ ఈ విషయంపై తాజాగా క్లారిటీ ఇచ్చారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)