NSR Prasad Passes Away: టాలీవుడ్ లో మరో విషాదం.. దర్శకుడు ఎన్ఎస్ఆర్ ప్రసాద్ కన్నుమూత.. గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ప్రసాద్
టాలీవుడ్ లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు, రచయిత ఎన్ఎస్ఆర్ ప్రసాద్ (49) ఆకస్మిక మరణం చెందారు. గత కొంత కాలంగా క్యాన్సర్ తో పోరాడుతూ ఆయన కన్నుమూశారు. ఆర్యన్ రాజేశ్ హీరోగా దివంగత డి.రామానాయుడు నిర్మించిన 'నిరీక్షణ' చిత్రంతో ఆయన దర్శకుడిగా మారారు.
Hyderabad, July 30: టాలీవుడ్ లో (Tollywood) మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు, రచయిత ఎన్ఎస్ఆర్ ప్రసాద్ (49) (NSR Prasad) ఆకస్మిక మరణం చెందారు. గత కొంత కాలంగా క్యాన్సర్ తో (Cancer) పోరాడుతూ ఆయన కన్నుమూశారు. ఆర్యన్ రాజేశ్ హీరోగా దివంగత డి.రామానాయుడు నిర్మించిన 'నిరీక్షణ' చిత్రంతో ఆయన దర్శకుడిగా మారారు. ఆ తర్వాత శ్రీకాంత్ తో 'శత్రువు', నవదీప్ తో 'నటుడు' చిత్రాలను తెరకెక్కించారు. ఆయన తాజా చిత్రం 'రెక్కీ' విడుదల కావాల్సి ఉంది. ప్రసాద్ స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం. చిన్న వయసులోనే ఆయన మృతి చెందడం సినీ పరిశ్రమలో విషాదాన్ని నింపింది. సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)