Suriya Emotional Video: వీడియో ఇదిగో, విజయకాంత్ సమాధి వద్ద భోరున ఏడ్చేసిన ప్రముఖ నటుడు సూర్య, నా అన్న ఇక లేరంటూ..

అనారోగ్యంతో విజయకాంత్ డిసెంబర్ 28న కన్నుమూశారు.వేడుకలకు ప్రత్యక్షంగా హాజరు కాని వారు సోషల్ మీడియా ద్వారా నివాళులర్పించారు.

Actor Suriya in tears as he pays tribute to Vijayakanth in Chennai Photo Credit-galattadotcom)

కోలివుడ్‌ నటుడు కెప్టెన్ విజయకాంత్ మరణ వార్త తమిళనాడుతో పాటు తెలుగు ప్రజలను విషాదంలో ముంచిన సంగతి విదితమే. అనారోగ్యంతో విజయకాంత్ డిసెంబర్ 28న కన్నుమూశారు.వేడుకలకు ప్రత్యక్షంగా హాజరు కాని వారు సోషల్ మీడియా ద్వారా నివాళులర్పించారు. ప్రస్తుతం నటుడు సూర్య విజయకాంత్‌కు నివాళులు అర్పించిన వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది.

విజయకాంత్ స్మారక స్థూపం వద్దకు చేరుకోగానే సూర్య తీవ్రమైన భావోద్వేగానికి గురై ఒక్కసారిగా ఏడుస్తూ ఆ వీడియోలో కనిపించారు. సూర్య కెరీర్ తొలి చిత్రం పెరియన్న విజయకాంత్‌తోనే మొదలైన సంగతి విదితమే.ఈ సినిమా సూర్య కెరీయర్‌లో 4వ చిత్రంగా వచ్చింది.

ప్రముఖ నటుడు కెప్టెన్‌ విజయకాంత్‌ ఇకలేరు.. కరోనాతో మృతిచెందిన డీఎండీకే వ్యవస్థాపకుడు

విజయకాంత్ స్మారక స్థూపం వద్ద కన్నీళ్లు పెట్టుకున్న సూర్య మాట్లాడుతూ..అన్నతో కలిసి పని చేస్తూ, మాట్లాడి, తింటూ గడిపిన రోజులు ఎప్పటికీ మరువలేను..నా సోదరుడు విజయకాంత్‌ మృతికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఇక లేరనే బాధ నాలో ఎప్పటికీ ఉంటుంది. అన్న విజయకాంత్ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను' అని తెలిపారు.

Here's Suriya Emotional Video

 

View this post on Instagram

 

A post shared by Galatta Media (@galattadotcom)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు