Mark Antony Movie: వీడియో ఇదే.. చావుకు దగ్గరగా వెళ్లిన హీరో విశాల్, అదుపుతప్పి వేగంగా వచ్చిన ట్రక్కు, హీరో పక్క నుంచే వెళ్లడంతో ఊపిరి పీల్చుకున్న యూనిట్

కోలీవుడ్‌ హీరో విశాల్‌ మార్క్‌ ఆంటోని' సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న సంగతి విదితమే. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో ఓ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అదుపుతప్పి వేగంగా వస్తున్న ట్రక్కు.. కింద పడి ఉన్న విశాల్‌ పక్క నుంచే వెళ్లింది.

Mark Antony Movie (Photo-Video Grab)

కోలీవుడ్‌ హీరో విశాల్‌ మార్క్‌ ఆంటోని' సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న సంగతి విదితమే. తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో ఓ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అదుపుతప్పి వేగంగా వస్తున్న ట్రక్కు.. కింద పడి ఉన్న విశాల్‌ పక్క నుంచే వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను చిత్రయూనిట్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. సాంకేతిక ఇబ్బందుల వల్ల ఈ ప్రమాదం సంభవించిందని, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించింది.

అటు విశాల్‌ కూడా ఈ వీడియో షేర్‌ చేస్తూ.. 'కొద్ది క్షణాలు.. కొన్ని అంగుళాల దూరంలో నా చావు కనిపించింది. థ్యాంక్‌ గాడ్‌.. ఈ ప్రమాదం తర్వాత తిరిగి షూటింగ్‌లో పాల్గొన్నాం' అని ట్వీట్‌ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now