Viswambhara Update: వీడియో ఇదిగో, జిమ్‌లో చెమటలు పట్టేలా వ్యాయామం చేస్తున్న చిరంజీవి, విశ్వంభర చిత్రంలో సరికొత్త లుక్‌తో రానున్న మెగాస్టార్

జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియోను చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు.

Megastar chiranjeevi in Gym (Photo-X/Chiru)

మెగాస్టార్ చిరంజీవి యువ దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో 156వ చిత్రం 'విశ్వంభర' చిత్రంలో నటిస్తున్న సంగతి విదితమే.ఈ చిత్రం కోసం చిరంజీవి జిమ్ లో చెమటోడ్చుతున్నారు. జిమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియోను చిరంజీవి సోషల్ మీడియాలో పంచుకున్నారు. సన్నద్ధమవుతున్నా... రంగంలోకి దిగేందుకు అమితాసక్తితో ఉన్నా అంటూ ట్వీట్ చేశారు. విశ్వంభర చిత్రంలో ఆయన పాత్ర పేరు భీమవరం దొరబాబు. గతేడాది నవంబరులో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది.ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. విశ్వంభర' సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)