Yatra 2 Movie Trailer: నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న యాత్ర 2 టీజర్, జగన్ లాంటోడితో యుద్ధం చేయడం మనకే నష్టం మేడమ్ అంటూ..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో కొన్ని సంఘటనల ఆధారంగా యాత్ర 2' సినిమా తెరకెక్కిన సంగతి విదితమే. ఈ మూవీ నుంచి తాజాగా టీజర్ విడుదలైంది.ఈ టీజర్‌లో ఓ చోట.. 'ఉన్నదంతా పోయినా పర్లేదని తెగించినా.. జగన్ లాంటోడితో యుద్ధం చేయడం మనకే నష్టం మేడమ్' అని సోనియాగాంధీతో ఓ పాత్రధారి చెప్పే సీన్..

Yatra 2 Movie Official Trailer

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో కొన్ని సంఘటనల ఆధారంగా యాత్ర 2' సినిమా తెరకెక్కిన సంగతి విదితమే. ఈ మూవీ నుంచి తాజాగా టీజర్ విడుదలైంది.ఈ టీజర్‌లో ఓ చోట.. 'ఉన్నదంతా పోయినా పర్లేదని తెగించినా.. జగన్ లాంటోడితో యుద్ధం చేయడం మనకే నష్టం మేడమ్' అని సోనియాగాంధీతో ఓ పాత్రధారి చెప్పే సీన్.. 'చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం అన్న.. కానీ ఒకవేళ గుర్తుపెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాట తప్పని కొడుకుగా మీరన్న ఆ చరిత్ర గుర్తుపెట్టుకుంటే చాలన్న' అనే మరో సీన్.. 'నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని' అని అసెంబ్లీలో జగన్ పాత్రధారి చెప్పే సీన్స్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. టీజర్ ఇలా ఉందంటే సినిమా అంతకుమించి ఉండబోతుందనే క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది.

2009 నుంచి 2019 వరకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన రాజకీయ ఘటనల ఆధారంగా 'యాత్ర 2' సినిమా తీశారు డైరెక్టర్ మహి వి రాఘవ. నారా చంద్రబాబు నాయుడు పాత్రలో బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాత్రలో సుజానె బెర్నెర్ట్, వై.ఎస్.భారతి పాత్రలో కేతకి నారాయణన్ నటించారు. ఈ ఫిబ్రవరి 8న ఈ సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Here's Yatra 2 Movie Official Trailer

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement