All Party Meeting: బంగ్లాదేశ్‌ సంక్షోభం నేపథ్యంలో ఢిల్లీలో సమావేశమైన అఖిలపక్షం.. అక్కడి తాజా పరిస్థితుల్ని వివరిస్తున్న ఎస్‌ జైశంకర్‌

బంగ్లాదేశ్‌ లో నెలకొన్న తీవ్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో కేంద్రం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభమైంది.

All Party Meeting

Newdelhi, Aug 6: బంగ్లాదేశ్‌ (Bangladesh)లో నెలకొన్న తీవ్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో  కేంద్రం అఖిలపక్ష సమావేశానికి (All Party Meeting) పిలుపునిచ్చింది. ఉదయం 10 గంటలకు ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజుజుతోపాటు లోక్‌ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న మల్లికార్జున ఖర్గే తదితరులు హాజరయ్యారు. బంగ్లాదేశ్‌ లో సంక్షోభంపై ఈ సమావేశంలో నేతలు చర్చిస్తున్నారు. ఆ దేశంలోని తాజా పరిస్థితుల్ని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌ జైశంకర్‌ (S Jaishankar) వివరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కేసుపై విచారణకు హాజరవ్వండి.. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ కు భూపాలపల్లి కోర్టు నోటీసులు.. మాజీ మంత్రి హరీశ్‌ రావు, మేఘా సంస్థ ఎండీ కృష్ణారెడ్డికి కూడా సమన్లు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now