Fire Accident in Delhi: ఢిల్లీ అలీపూర్‌ లో అగ్ని ప్రమాద ఘటనలో పదకొండుకు చేరిన మృతుల సంఖ్య

ఓ పేయింట్‌ పరిశ్రమలో గురువారం సాయంత్రం మంటలు చెలరేగాయి.

Fire Accident in Delhi (Credits: X)

Newdelhi, Feb 16: దేశ రాజధాని ఢిల్లీ (Delhi) అలీపూర్‌ లోని మార్కెట్‌ లో నిన్న సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదం (Fire Accident) ఘటనలో ఇప్పటి వరకు 11 మంది దుర్మరణం చెందారు. ఓ పేయింట్‌ పరిశ్రమలో గురువారం సాయంత్రం మంటలు చెలరేగాయి. మంటలు సమీపంలోని దుకాణాలతో పాటు ఇండ్లకు వ్యాపించాయి. అలీపూర్‌ లోని దయాల్‌ పూర్ మార్కెట్‌ లోని ఫ్యాక్టరీలో 11 మంది కాలిపోయిన మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. అగ్నిప్రమాదంలో ఒక పోలీసు సహా నలుగురు కానిస్టేబుల్స్ గాయపడ్డారు. వీళ్లు చికిత్స పొందుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రమాదానికి ఖచ్చితమైన కారణాలు తెలియదని.. గల్లంతైన వారి కోసం గాలింపు చేపడుతున్నట్లు వివరించారు.

Helicopter Ride for Medaram: మేడారానికి హెలికాప్టర్‌ లో వెళ్లొచ్చు.. ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు సేవలు .. త్వరలో ధరల వెల్లడి

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)