
Medaram, Feb 16: ఆసియా (Asia) ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం (Medaram) కు ఆకాశ మార్గంలో వెళ్లేవారి కోసం గత మూడు దఫాల్లో హెలికాప్టర్ సేవలను (Helicopter Ride Services) అందుబాటులోకి తీసుకొచ్చిన పర్యాటక శాఖ ఎప్పటిలాగే ఈసారి కూడా ఏర్పాట్లు చేస్తున్నది. హనుమకొండ నుంచి మేడారం వెళ్లేందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ప్రయాణించిన వారికి ప్రత్యేక దర్శనం కూడా ఉంటుంది. మొక్కులు చెల్లించిన తర్వాత తిరుగుపయనం చేస్తారు. ఫిబ్రవరి 21 నుంచి 25 వరకు సేవలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ధరలు రెండు రోజుల్లో నిర్ణయించనున్నట్లు తెలుస్తున్నది.
