AP TET Results 2022 Declared: ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల, పరీక్షల్లో 58.07% మంది అర్హత, ర్యాంకు కార్డును aptet.apcfss.in ద్వారా డౌన్లోడ్ చేసుకోండి

పరీక్షల్లో 58.07% మంది అర్హత సాధించినట్లు రాష్ట్ర పాఠశాల విద్య కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ ప్రకటించారు. టెట్‌ను ఆన్‌లైన్‌లో విడతలవారీగా నిర్వహించినందున నార్మలైజేషన్‌ విధానాన్ని అమలు చేశారు.

Representational Picture. Credits: PTI

ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షల్లో 58.07% మంది అర్హత సాధించినట్లు రాష్ట్ర పాఠశాల విద్య కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ ప్రకటించారు. టెట్‌ను ఆన్‌లైన్‌లో విడతలవారీగా నిర్వహించినందున నార్మలైజేషన్‌ విధానాన్ని అమలు చేశారు. మొత్తం 150 మార్కులకు జనరల్‌ అభ్యర్థులు 60%, బీసీలు 50%, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మాజీ సైనికోద్యోగుల పిల్లలు 40% మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఈ ఏడాది టెట్‌కు 4,07,329 మంది హాజరయ్యారు. అభ్యర్థులు తమ మార్కుల వివరాలను ప్రభుత్వ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

Bandi Sanjay: మహారాష్ట్ర ఫలితాలు తెలంగాణలోనూ రిపీట్ అవుతాయి, సీఎం రేవంత్ ప్రచారం చేసిన చోట కాంగ్రెస్ ఓడిపోయిందన్న బండి సంజయ్...మోదీ అభివృద్ధి మంత్రమే పనిచేసిందని వెల్లడి

Andhra Pradesh Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, మొత్తం 21 బిల్లులు ఆమోదం, 10 రోజుల పాటు 59 గంటల 55 నిమిషాల పాటు సభా కార్యకలాపాలు

Andhra Pradesh Assembly Session: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు, కీలక బిల్లులకు ఏపీ శాసనమండలి ఆమోదం, అనంతరం నిరవధిక వాయిదా

YS Sharmila: జగన్‌పై మరోసారి నిప్పులు చెరిగిన వైఎస్‌ షర్మిల, ప్రభాస్‌తో సంబంధం అంటగట్టారు..ఇదంతా చేయించింది జగనే...అప్పుడు ఎందుకు ఎంక్వైరీ అడగలేదో చెప్పాలని షర్మిల డిమాండ్