ICSE Board Exams 2021: ఐసీఎస్ఈ పదవ తరగతి బోర్డు పరీక్షలు రద్దు, కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం, ఆఫ్‌లైన్‌లో 12వ తరగతి బోర్డు పరీక్షలు, పరీక్షల తేదీలను తర్వాత ప్రకటిస్తామని తెలిపిన ఐసీఎస్ఈ
ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 12వ తరగతి బోర్డు పరీక్షలను మాత్రం ఆఫ్‌లైన్‌లో నిర్వహించనున్నారు.
అయితే ఆ పరీక్షల తేదీలను తర్వాత ప్రకటిస్తారు. జూన్‌లో నిర్వహించే సమీక్ష తర్వాత ఈ నిర్ణయం తీసుకోనున్నారు. ఏప్రిల్ 16వ తేదీన జారీ చేసిన సర్క్యూలర్‌ను ఉపసంహరిస్తున్నట్లు బోర్డు పేర్కొన్నది. విద్యార్థులు, టీచింగ్ స్టాఫ్ ఆరోగ్యం కీలకమైందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీఎస్ఈ చెప్పింది.
Here's Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)