Group-1 Deadline Extended: తెలంగాణ గ్రూప్-1 ఉద్యోగ నియామక పరీక్షకు దరఖాస్తుల గడువు పొడిగింపు.. శనివారం సాయంత్రం 5 గంటల వరకు అవకాశం

గ్రూప్-1 ఉద్యోగ నియామక పరీక్షకు దరఖాస్తుల గడువును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) పొడిగించింది. అభ్యర్థులకు మరో రెండు రోజుల పాటు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశమిచ్చింది.

Representational Picture. Credits: PTI

Hyderabad, Mar 15: గ్రూప్-1 (Group-1) ఉద్యోగ నియామక పరీక్షకు దరఖాస్తుల గడువును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) (TSPSC) పొడిగించింది. అభ్యర్థులకు మరో రెండు రోజుల పాటు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశమిచ్చింది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 563 గ్రూప్-1 పోస్టుల భర్తీకి గత నెల 19వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. బుధవారం వరకు 2.7 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి. షెడ్యూల్ మేరకు గురువారం సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుకు గడువు ముగిసింది. అయితే దరఖాస్తు గడువును రెండు రోజులు పొడిగిస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. https://www.tspsc.gov.in/ ద్వారా శనివారం సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now