Pradhan Mantri Ujjwala Yojana: గ్యాస్ వినియోదారులకు పెద్ద ఊరట.. ఉజ్వల యోజన మరో ఏడాదిపాటు రూ.200ల సబ్సిడీ
గ్యాస్ వినియోదారులకు పెద్ద ఊరట కలిగించే వార్త ఇది. ఉజ్వల యోజన కింద ప్రతి సంవత్సరం 12 గ్యాస్ సిలిండర్లపై అందుతున్న సబ్సిడీని ఉజ్వల యోజన లబ్ధిదారులకు మరో ఏడాది పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. దేశంలోని 9.5 కోట్ల మందికిపైగా వినియోగదారులు ప్రతి నెలా గ్యాస్ సిలిండర్‌పై రూ.200 ప్రయోజనం పొందనున్నారు.
Newdelhi, March 25: గ్యాస్ (Gas) వినియోదారులకు పెద్ద ఊరట కలిగించే వార్త ఇది. ఉజ్వల యోజన (Pradhan Mantri Ujjwala Yojana) కింద ప్రతి సంవత్సరం 12 గ్యాస్ సిలిండర్లపై అందుతున్న సబ్సిడీని (Subsidy) ఉజ్వల యోజన లబ్ధిదారులకు మరో ఏడాది పాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. దేశంలోని 9.5 కోట్ల మందికిపైగా వినియోగదారులు ప్రతి నెలా గ్యాస్ సిలిండర్‌పై రూ.200 ప్రయోజనం పొందనున్నారు. దీంతో ప్రభుత్వంపై రూ.7,680 కోట్ల భారం పెరగనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ముందుగా రూ.6,100 కోట్లు ఖర్చు చేశారు. ఉజ్వల సబ్సిడీ నేరుగా అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది. ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు అంటే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ,భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఇప్పటికే మే 22, 2022 నుంచి ఈ సబ్సిడీని ఇస్తున్నాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)