Gas Cylinder at Rs 500: రూ.500 వంట గ్యాస్ సిలిండర్ పై ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు.. ఎల్పీజీ డీలర్స్ అసోసియేషన్
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన కీలక హామీల్లో రూ.500కే గ్యాస్ సిలిండర్ ఒకటి. ఈ పథకం పొందడానికి కేవైసీ తప్పనిసరి అని చెప్పడంతో వినియోగదారులు ఇప్పటికే గ్యాస్ కంపెనీలకు వరుస కడుతున్నారు.
Hyderabad, Dec 22: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ (Congress) ఇచ్చిన కీలక హామీల్లో రూ.500కే గ్యాస్ సిలిండర్ (Gas Cylinder at Rs 500) ఒకటి. ఈ పథకం పొందడానికి కేవైసీ (KYC) తప్పనిసరి అని చెప్పడంతో వినియోగదారులు ఇప్పటికే గ్యాస్ కంపెనీలకు వరుస కడుతున్నారు. అయితే తెలంగాణలో రూ.500కే వంట గ్యాస్ సిలిండర్‌పై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదని గ్రేటర్ హైదరాబాద్ ఎల్పీజీ డీలర్స్ అసోసియేషన్ తెలిపింది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ... ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నియమ నిబంధనలను రూపొందించలేదన్నారు. కేవైసీ అప్ డేట్ చేసిన వారికి మాత్రమే రూ.500కు ఉచిత గ్యాస్ సిలిండర్ వస్తుందని జరుగుతోన్న ప్రచారంలో నిజం లేదన్నారు. అది అపోహ మాత్రమే అన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)