TS SSC, Inter Results: వచ్చే వారంలో తెలంగాణ పదో తరగతి, ఇంటర్ ఫలితాలు.. ఏయే తేదీల్లో ఫలితాలు ప్రకటించే అవకాశం ఉన్నదంటే??
వచ్చే వారంలో తెలంగాణ పదో తరగతి, ఇంటర్ ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది. ఈ రెండు పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయిందని తెలుస్తోంది.
Hyderabad, May 7: వచ్చే వారంలో (Next Week) తెలంగాణ (Telangana) పదో తరగతి (SSC), ఇంటర్ ఫలితాలను (Inter Results) ప్రకటించే అవకాశం ఉంది. ఈ రెండు పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయిందని తెలుస్తోంది. ఫలితాల ప్రాసెసింగ్ తుది దశలో ఉందని అధికార వర్గాల సమాచారం. ఈ నెల 10న ఇంటర్మీడియెట్ ఫలితాలు, 12న పదో తరగతి ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ విషయంపై ఒకటి రెండు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. రాష్ట్రంలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించిన ఇంటర్ పరీక్షలకు 5,05,625 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు జరిగిన పదో తరగతి పరీక్షలను 7,39,493 మంది విద్యార్థులు రాశారు.
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)