Rains in Telugu States: రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు.. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక
తెలుగు రాష్ట్రాలకు భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) భారీ వర్ష సూచన చేసింది. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనూ, యానాంలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Hyderabad, July 24: తెలుగు రాష్ట్రాలకు (Telugu States) భారత వాతావరణ సంస్థ (ఐఎండీ-IMD) భారీ వర్ష సూచన చేసింది. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు ఏపీ (AP), తెలంగాణ (Telangana) రాష్ట్రాల్లోనూ, యానాంలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని పేర్కొంది. ఈ నెల 25 నుంచి 27 వరకు రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని, కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఈ నెల 25, 26 తేదీల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. తెలంగాణలో ఈ నెల 25 నుంచి 27 వరకు అతి భారీ వర్షాలు పడే అవకాశముందని అంచనా వేసింది. దేశంలో రుతుపవన ద్రోణి స్థిరంగా, క్రియాశీలకంగా కొనసొగుతోందని ఐఎండీ వెల్లడించింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)